— విద్యార్థి దశలోనే అది సాధ్యమవుతుంది
— జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ మునవర్ హుస్సేన్
సిరా న్యూస్,మంథని;
సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలంటే కృషి పట్టుదల ఎంతో ముఖ్యమని జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ మునవర్ హుస్సేన్ అన్నారు. శనివారం పట్టణంలోని అక్షర పాఠశాలలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ దేశానికి ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. తాను సివిల్ సర్వీసెస్ లో స్థిరపడాలని భావించానని, తన తండ్రిని ఇన్స్పైర్ గా తీసుకొని జ్యుడీషియల్ లో స్థిరపడాలని ఎల్ ఎల్ బి చేశానన్నారు. తలనంతరం హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు 2022లో ఉత్తీర్ణుడై అనుకున్న లక్ష్యాన్ని సాధించానన్నారు. మనకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశ నెరవేర్చాలన్న, చదువు నేర్పిన ఉపాధ్యాయుల రుణం తీసుకోవాలన్న విద్యార్థి దశలోనే చదువుపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ పిఎస్ అశోకన్, ప్రిన్సిపాల్ బిందు మాట్లాడుతూ మహమ్మద్ మునవర్ హుస్సేన్ పాఠశాలలో ఎంతో చురుకైన విద్యార్థిగా ఉండేవారని గుర్తు చేశారు. అతి పెద్ద వయసులో 26 సంవత్సరాలకే జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణం అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే ఒక లక్ష్యంతో కృషి చేయాలని అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని వారు పేర్కొన్నారు. విద్యార్థిని, విద్యార్థుల్లో ఇలాంటి పట్టుదల పెంపొందాలని ఉద్దేశంతో తమ పాఠశాలలో పూర్వ విద్యార్థి అయిన మహమ్మద్ మునవర్ హుస్సేన్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు మహావాది సతీష్ కుమార్ మాట్లాడుతూ మహమ్మద్ మునవర్ హుస్సేన్ ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయుడు రామడుగు శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.