గ్రూప్ 1అభ్యర్దులపై లాఠీ చార్జ్ ను ఖండించిన హరీష్ రావు

సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేటలో క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.
హరీశ్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువత పై కాంగ్రెస్ ప్రభుత్వ వికృత దాడీని ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగం ఆధారంగా నడుస్తాం. రిజర్వేషన్లు అమ లు అవుతాయి.రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు లో రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారు. కేసీఆర్ హయంలో జి ఓ 55 అమలు చేశాం. ఈ ప్రభుత్వం జీవో 29 తెచ్చారు. ఈ జీవో వల్ల ఎస్ సి, ఎస్టి, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతోంది. 29 జీవో తో పై తరగతుల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాహుల్ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతారు. వారి ప్రభుత్వం ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఏ రాజ్యాంగం భగవద్గీత అని రేవంత్ చెబుతున్నారో, ఆ రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయడం లేదు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేషన్లకు అప్లయ్ చేయడం వల్ల నష్టం. ఓపెన్ లో వచ్చిన వాటిని రిజర్వేషన్లకు కన్సిడర్ చేయొద్దు. దళితులకు, బిసిలకు, బలహీన వర్గాలకు అన్యాయం చేయడమే మీ పాలసినా, దళిత వర్గానికి చెందిన బట్టి విక్రమార్క కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ లో ఉన్న దళిత, బలహీన, మైనార్టీ వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సిఎం రేవంత్ రెడ్డిని నిలదీయాలి.యూపిపి ఎస్ సి లో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయి. కానీ టీపీ పీఎస్ సి లో అందుకు అమలు కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. ఓపెన్ లో బలహీన వర్గాలకు ప్రవేశం లేకుండా చేస్తున్నది. హక్కులు కాపాడాలని పిల్లలు రోడ్ల మీదకు వస్తె ఉక్కుపాదం తో అణచి వేస్తున్నారు. విద్యార్థుల ఆర్తనాదాలతో అశోక్ నగర్ అల్లడుతోంది. టెర్రరిస్టుల తో, సంఘ విద్రోహ శక్తులతో వ్యవహరించినట్లు వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు అంత కఠినంగా, కర్కశంగా విద్యార్థులతో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి పిల్లలను రోడ్డు మీదకు తెచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు చేశారా ? ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. నింపారా? కనీసం రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ ప్రక్రియ ను పూర్తి చేసిన వాటికి కాగితాలు ఇవ్వడం తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు.ఓట్లు వచ్చినప్పుడు కాదు, రేవంత్ రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు అశోక్ నగర్ కు వెళ్ళాలి. పోలీస్ బలగాలు, లాటి చార్జీలు, ఇనుప కంచెలతో విద్యార్థుల్ని అణచి వెద్దా మనుకుంటే మరింత ఉదృతం అవుద్ది.
విద్యార్థులకు నిరుద్యోగుల గొంతుక అవుతానన్న కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. కోదండరాం కు ఎమ్మెల్సీ పదవి రాగానే గొంతు మూగపోయిందా ? కోదండరాం, రియజ్, ఆకునూరి మురళీ, నవీన్ లాంటి వాళ్ళు ఉద్యోగాలు పొందారు. తప్ప విద్యార్థులకు దగా మిగిలింది.
పదవులు పొందిన వారంతా అశోక్ నగర్ కు రావాలి.
ఈ వానాకాలం రైతులకు బంధు ఇవ్వరట. ఇప్పుడే తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి చెంపలేసుకుని రైతులకు క్షమాపలు చెప్పాలి. లక్షా 50 వెలతో మూసి సుందరీ కరణ అని చెప్పే రేవంత్ కు రైతులకు 15 వేలు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు వానాకాలం రైతు బంధు ఇవ్వాల్సిందే మేం ఊరుకోమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *