సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మంకోడూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీ. నర్సారెడ్డి, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ తదితరులు పాల్గోన్నారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరువును కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు…. మాజీ కాగానే వాస్తవాలను వక్రీకరిచడం దురదృష్టం. వర్ష ప్రభావం వలన కరువు ఏర్పడుతుంది వాస్తవం గుర్తుంచుకోవాలి. గతంలో మీరు 2 బీహెచ్కే కట్టిన ఇండ్లలో ఓట్లు అడుకోండని అన్నారు.
నిన్నటి వరకు 5 ఎకరాలు ఉన్న అందరికి వచ్చినది… మీరు ఎన్ని రోజుల వరకు ఇచ్చారు మీరు చూసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి మా పై మోపి వెళ్లారు….. 10 ఏళ్ల ప్రభుత్వం అప్పులు 7 లక్షల కోట్లు చేశారు. గత ప్రభుత్వం చేసిన పనులకు కూడా లక్ష 50 కోట్ల రూపాయల పనులకు ప్రోసడింగ్ లు ఇచ్చారు… వాటి బిల్లులు ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి నిర్ణయం చట్టారిత్యా నిర్ణయం తీసుకుంట్టుది. కేద్రం ప్రభుత్వం తో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం పాటుపడుతాం. మీ లాగా మేం వెక్తుల కోసం రాష్టం కోసం పని చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి కొరత లేకుండా చూస్తున్నాం. అకాల వర్షాల తో నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు వచ్చినది అనే ముర్కులకు చెపుతున్న.కాళేశ్వరం ప్రాజెక్టు బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కట్టినది మేరే కూల్చినది మేరే. మానస పుత్రిక అనే పేరు మాత్రం మీకు…. ప్రాజెక్టు కులుతే మాది ఎలా బాధ్యత అవుతుంది. ప్రజా పాలన అప్లికేషన్లు 1కోటి 20 లక్షలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసాము. తెలంగాణ లో 17 కు 17 గెలిపించాలని కోరుతున్నాము. ఆర్టీసీ ని నాశనం చేసినది బి ఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో నడుతున్నది. టెట్ పిజు కోసం ఆల్చిస్తున్నాము కచ్చితంగా తగ్గిస్తుంది… సరిదిద్దుకోవడాని కొంచం సమయం తీసుకుట్టున్నామని అన్నారు.