లవర్ కోసం వచ్చి అడ్డంగా దొరికి పోయాడు

సిరా న్యూస్,తిరుపతి;
చిత్తూరు జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది.. ఓ యువకుడు లేడీస్ హాస్టల్‌లోకి చొరబడటం కలకలంరేపింది. మనోడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత.. లేడీస్ హాస్టల్‌లోకి ఎందుకు వెళ్లావని అడిగితే యువకుడు చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఓ విద్యార్థిని గుడుపల్లెలోని కాలేజీలో ఉన్న హాస్టల్‌లో ఉంటోంది.. ఆమె నర్సింగ్ సెకండియర్ చదువుతోంది. కేరళలోని త్రిసూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో కుకింగ్‌ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు.నర్సింగ్ చదువుతున్న యువతి, కుకింగ్ పనులు చేస్తున్న యువకుడు.. రెండేళ్ల క్రితం కేరళలో కలిసి చదువుకోగా.. ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ప్రియురాలు హాస్టల్‌లో ఉండటంతో ఆమెను చూడాలనిపించింది.. వెంటనే బెంగళూరులో బయల్దేరి కుప్పం చేరుకున్నాడు. ఇటు ప్రియురాలు హాస్టల్‌లో ఉండటంతో.. ఆమెను కలిసేందుకు వీలు లేకుండా పోయింది. ఎలాగైనా ప్రియురాలిని కలవాలని మాస్టర్ ప్లాన్ వేశాడు.. మారు వేషంలో లేడీస్
హాస్టల్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు,హాస్టల్‌ సిబ్బందికి అనుమానం రాకుండా సినిమా స్టైల్‌లో ప్లాన్ చేశాడు. ఒక బురఖా కొనుగోలు చేసి.. దానిని ధరించి తన ప్రియురాలిని కలిసేందుకు లేడీస్ హాస్టల్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ హాస్టల్ సిబ్బందికి ఎందుకో అనుమానం వచ్చింది.. వెంటనే అప్రమత్తమై అనుమానంతో తనిఖీ చేయగా యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. కాలేజీ సిబ్బంది అతడిని పట్టుకుని ఒక గదిలో ఉంచారు.. ఆ తర్వాత కాలేజీ యాజమన్యం సూచన మేరకు ఆ యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. లేడీస్ హాస్టల్‌లోకి ఎందుకు వెళ్లావని కాలేజీ సిబ్బంది, పోలీసులు ప్రశ్నించగా.. తన ప్రియురాలిని కలవడం కోసం వెళ్లానని సమాధానం చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌ అరుణ్‌కుమార్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఎక్కడో బెంగళూరులో ఉంటూ ఉపాధి పొందుతున్న యువకుడు.. ప్రియురాలిని కలుద్దామని వచ్చి పిచ్చి ప్లాన్‌తో అడ్డంగా దొరికిపోయాడు.. అనవసరంగా జైలు పాలయ్యాడు. ఈ ఘటన
స్థానికంగా కలకలంరేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *