సిరాన్యూస్, ఇచ్చోడ
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : హెల్త్ అసిస్టెంట్ రాజ్ కిరణ్ రెడ్డి
ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ అసిస్టెంట్ లు రాజ్ కిరణ్ రెడ్డి, సుభాష్‌లు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్బంగా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం, ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.