సిరా న్యూస్, బేల:
పాఠన్ లో ఉచిత వైద్య శిబిరం…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాఠన్ గ్రామములో, సైద్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. అనంతరం వైద్య సిబ్బంది మాట్లాడుతూ… ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, వైద్య సిబ్బంది అనసూయ, దీక్షారాణి, లక్ష్మి, రూపాలి, ఆశా వర్కర్లు బబిత, వైశాలి లక్ష్మి, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.