సిరా న్యూస్,కర్నూలు;
కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం,నిట్రవట్టి, గ్రామంలో కుండపోతగా వర్షానికి పలు కాలనీలు జలమయమైయాయి. ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో తీవ్రఇబ్బందులు గురవుతున్నారు. గూళ్యం గాదిలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర రహదారిపై భారీగా వర్షపునీరు చేరడం తో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హాలహర్వి, బాపురం,గూళ్యం,నిట్రవట్టి వెళ్లే రహదారిపై భారీ వర్షం రావడంతో వాగులు వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.గ్రామాల్లో భారీ వర్షం రావడంతో కూలీ పనులకు వెళ్లిన వారు ఇళ్లకు చేరుకోవడానికి ఇళ్ల ముందు వర్షపునీరు వంకలుగా పారడంతో దాటడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.ఇదివరకు ఎప్పుడు ఇంత పెద్దవర్షం రావడం గ్రామాల్లో నీరు పారడం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు అన్నారు.