సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా, రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వర్షం కారణంగా ఉదయం రావలసిన స్పైస్జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా, విమానాలు దారి మళ్లింపు చేసారు. రన్వే పైన వర్షపు నీరు నిలవడంతో విమానాలు రాకపోకలు నిలిపివేశారు. ప్రయాణికులు ఎలా వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఏర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికులు విమానాలు వచ్చే సమయాలు తెలపమని ఏయిర్ లైన్స్ సిబ్బందిని కోరినా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు.