సిరా న్యూస్,సికింద్రాబాద్;
బోయిన్ పల్లి పి ఎస్ పరిధిలో కంసారి బజార్ లో ఓ ఇంట్లోభారీ చోరీ జరిగింది. సురేష్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు నకిలీ తాళాలతో ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేశారు. 30 తులాల బంగారం అపహరణకు గురైనట్లు బాధితుడు సురేష్ తెలిపాడు.
ఇంట్లో వాళ్ళు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అల్మారా తాళం పగులగొట్టిన సమయంలో దుండగుల చేతికి గాయం అయినట్లు దానిపై ఉన్న రక్తం మరకల ఆధారంగా గుర్తించారు. క్లూస్ టీమ్స్, సీసీ కెమెరాలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు..