-మట్టెలు అందించిన మెండే రాజేశ్వరి,రాజయ్య దంపతులు
సిరా న్యూస్,మంథని;
మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన నిరు పేద కుటుంబానికి చెందిన బోసెల్లి శంకరమ్మ- (కీర్తిశేషులు.ముత్తయ్య )ల కుమార్తె స్నేహ వివాహ కార్యక్రమం సందర్బంగా అదే గ్రామానికి చెందిన మెండే రాజేశ్వరి, రాజయ్య దంపతులు శుక్రవారం నూతన వధువు స్నేహను ఆశీర్వదించి మట్టెలు అందజేశారు.మీ కుటుంబానికి అండగా ఉంటానని తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మెండే దంపతులు వారికి భరోసానిచ్చారు. నిరుపేద కుటుంబానికి తమకు తోచిన విధంగా మట్టెలు అందించి చేయూతనిచ్చిన మెండ రాజయ్య దంపతులను పలువురు అభినందించారు.