సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్
సిరా న్యూస్;
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సెన్సేషనల్ సూపర్ హిట్ ఆడియో అందించిన స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ‘హాయ్ నాన్న’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
తెలుగులో చేసిన మొదటి చిత్రంతోనే ఇక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు కదా.. ఈ ఆదరణ ఎలా అనిపిస్తోంది?
చాలా ఆనందంగా వుంది. అయితే ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రతి సినిమా ఒక పరీక్షే. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. ఇంకా కొత్తగా ఎక్స్ ఫ్లోర్ చేయాలి. హాయ్ నాన్న చిత్రం నన్ను నేను ఎక్స్ ఫ్లోర్ చేసుకోవడానికి తోడ్పడింది.