సిరా న్యూస్,హైదరాబాద్;
ఎంసిఆర్ హెచ్ఆర్ డి లో వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధి, వరంగల్ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ లకు సంబంధించి భూసేకరణ తదితర అంశాల పై మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్, సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పలువురు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆర్ అండ్ బి మరియు ఎంఎయుడి ఉన్నతాధికారులు, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్ లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.