సిరా న్యూస్,కాకినాడ;
తల్లి ,తండ్రి ,గురువుల చెప్పిన మాటలు వినడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మహా సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు పేర్కోన్నారు. కాకినాడ సినిమా రోడ్లల సూర్యకళామందిరంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో మహాసహస్రావధాని పద్మశ్రీ డా॥ గరికపాటి నర సింహరావు వ్యక్తిత్వ వికాశం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అద్యక్షులు శిష్ట్లా శ్రీకాంత్ అధ్యక్షత వహించగా మహా సహస్రావధాని పద్మశ్రీ డా॥ గరికపాటి నరసింహరావు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా॥ గరికపాటి నరసింహరావు విద్యార్థులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, క్లబ్ సెక్రటరీ దామెర శ్రీకాంత్, ట్రెజరర్ స్వరూప్జు, పాస్ట్ ప్రెసిడెంట్ జి.వి.కృష్ణప్రకాష్, డాల్ఫిన్ వెంకన్న, నల్లమిల్లి మాచారెడ్డి, ముంజులూరి విశ్వేశ్వరావు, సూర్యారావు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజు, పెద్దరాజు, ఆనంద్, చందు, చార్మినార్ వర్మ, సత్యమూర్తి, పద్మజావాణి, వీనాక్షి పెద్ద సంఖ్యలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, రోటరాక్ట్ సభ్యులు పాల్గొన్నారు.