సిరాన్యూస్, ఆదిలాబాద్
అదనపు కలెక్టర్, డీఈఓలకు ఆహ్వానం అందజేత : హిందీ భాష సేవా సమితి అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 20న జాతీయ భాష హిందీ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని హిందీ భాష సేవా సమితి అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారిని టీ ప్రణితలను సమితి సభ్యులు కలెక్టరేట్ సమావేశం మందిరంలో కలిశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని ఆహ్వానించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొనే హిందీ ఉపాధ్యాయులందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. స్పందించిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి జిల్లా విద్యాశాఖ అధికారిని టీ ప్రణీతను ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఈ కార్యక్రమంలో హిందీ భాష సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుకుమార్ పేట్కులే, ద్రోణాలే దత్తాత్రేయ, ఉపాధ్యక్షులు రవి జాబాడే, కోశాధికారి చంద్రశేఖర్ అంబేకర్, కార్యవర్గ సభ్యులు జావిద్ అలీలు పాల్గొన్నారు.