సిరా న్యూస్,మంచిర్యాల;
అక్రమంగా గోవులను తరలిస్తున్నారని సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గోవులను తరలిస్తున్న కంటైనర్లను పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్గేట్ వద్ద రెండు కంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎద్దులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు 32 ఎద్దులను పోలీసులు తరలించారు. సుల్తానాబాద్ వెటర్నరీ డాక్టర్ వాటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు సూర్య మాట్లాడుతూ… ఇటీవల కాలంలో సుమారు 100కు పైగా గోవులను గోశాలకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారు.