సిరా న్యూస్,నాయుడుపేట;
లారీ వేగంగా వెళుతూ పలు వాహానాలు ఢీకొట్టింది. డిఎస్పీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న హోం గార్డు చోరవతో లారీ ఆగపోయింది. మరిన్నీ ప్రమాదాలు తప్పాయి. లారీ చెంబెడు నుండి వడ్ల లోడు తీసుకొని లారీ డ్రైవర్ ఫుల్ గా తాగి వాహనాన్ని వేగంగా నడపడంతో అడ్డువచ్చిన నాలుగు ఆటోల్ని నాలుగు బైకుల్నిఢీకొని వెళ్లిపోయింది. విషయాన్ని నాయుడుపేట డిఎస్పీ డ్రైవర్ హోంగార్డు భాస్కర్ కు అతని స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో అతను వెంటనే స్పందించి నాయుడుపేట ౼ మల్లం జంక్షన్ దగ్గర లారీని నిలిపేప్రయత్నం చేసాడు. అక్కడ మరో రెండు లారీలు గుద్ధి వచ్చేస్తుండగా వెనకాలనే ఫాలో అయ్యి నాయుడుపేట స్వర్ణముఖి బ్రిడ్జి వద్ద లారీని ఆపివేసాడు. దాంతో ప్రమాదాలు తప్పాయి.