సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో హోం ఓటింగ్ ప్రారంభం
85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, వికలాంగ ఓటర్లకు ఇంటి వద్దనే ( హోమ్ ఓటింగ్) ఓటు హక్కు ప్రక్రియ సోమవారం ఓదెల మండలంలోని కొమి రె గ్రామంలో పోలింగ్ అధికారి పి శ్రీధర్ ప్రారంభించారు. పోలింగ్ బూతుకు రానీ వృద్ధులు ఇంటి వద్దనే పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. ఇందులో ఐదుగురు ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొత్కపల్లి ఏఎస్ఐ బి. గోపికృష్ణ, కొమరె గ్రామ కార్యదర్శి ప్రసాద్, అంగన్‌వాడీ టీచర్ కే సుజాత తదితరులు పాల్గొన్నారు.