సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు :జిల్లా ఉద్యాన అధికారి సిహెచ్ జగన్మోహన్ రెడ్డి
ఆయిల్‌పామ్ సాగు తో రైతులకు అధిక లాభాలు వస్తాయని జిల్లా ఉద్యాన అధికారి సిహెచ్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన శాఖ, తిరుమల ఆయిల్ కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , నూతనంగా వచ్చిన ఉద్యాన అధికారి మహేష్ తిరుమల ఆయిల్ కంపెనీ సీఈఓ కేశవ్ కళ్యాణ్కర్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ లో భాగంగా శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామంలోని రైతు గీట్ల వరుణ్ , జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 9 10ఎకరాలలో 527 పామ్ ఆయిల్ మొక్కలను నాటారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో జిల్లాకు 2000 ఎకరాలు లక్ష్యంగా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మొక్కలు, అంతర పంట పెట్టినందుకు సంవత్సరానికి రూ.4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు కలపి రూ.16800 ఉద్యాన శాఖ ద్వారా రాయితీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.మొదటి సంవత్సరం మొక్కలు నాటేటప్పుడు ఒక్కొక్క గుంతలో 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ట్ పాస్ పెట్ , 50 గ్రాములు ఫోర్ రేట్ గుళికలు వేసి కలిపిన మట్టితో నింపాలన్నారు. కార్యక్రమం లో జిల్లా ఉద్యాన అధికారులు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు,ఆయిల్ పామ్ ఫీల్డ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.