సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడివేడిగా ప్రారంభమైంది. వేసవికాలం సమీపిస్తున్న సమయంలో ప్రజలకు ఏవిధంగా వసతులు కల్పించాలని దానిపై చర్చ జరిగింది. అంతలోనే ప్రజల కోసం మాట్లాడే సమయంలో ప్రసంగం ఏమిటని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అడ్డుకున్నారు. అయినా తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రసంగం కొనసాగించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. పక్కనే ఉన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కలగజేసుకొని.. ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో వేసవి సమీపిస్తున్న వేళ మంచినీళ్లు సాగునీళ్లు ఇబ్బందు లేకుండా చూసేందుకు ఈ మీటింగ్ ఉపయోగపడాలని నచ్చజెప్పారు.