పిఠాపురంలో హాట్.. సీట్…

 సిరా న్యూస్,కాకినాడ;
పిఠాపురం సీటు ఎందుకంత హాటు? ఇక్కడ గెలుపుపై పార్టీల ధీమా వెనుకకారణమేంటి? సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ.. పిఠాపురంలోవన్స్‌మోర్‌ నినాదంతో దూసుకుపోతుండగా, కూటమి కట్టిన టీడీపీ-జనసేన కూడావిజయంపై చాలా ధీమాగా ఉన్నాయి. పొత్తుల్లో ఏ పార్టీకి సీటు ఇచ్చినా విజయంమాత్రం పక్కా అంటున్నాయి. ఇలా రెండు పక్షాలు.. విజయంపై నమ్మకంపెంచుకోవడంతో పిఠాపురంలో పొలిటికల్‌ పిక్చర్‌ రక్తి కట్టిస్తోంది.ఉమ్మడితూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం రాజకీయం వేడి పుట్టిస్తోంది. కాపుసామాజికవర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష
టీడీపీ-జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాపుల ఇలాఖాలో విజయంసాధించి.. ఆ వర్గంలో తన బలం చెక్కుచెదరలేదని నిరూపించుకోవాలని వ్యూహంరచిస్తోంది వైసీసీ. దీనికి తగినట్టుగానే సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెందొరబాబును పక్కన పెట్టేసి.. కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దింపాలనిప్లాన్‌ చేసింది.

గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గీతకు ఇక్కడమంచి ఫాలోయింగ్‌ ఉండటంతో ఆమె విజయం నల్లేరుపై నడకగా భావిస్తోంది. ఐతేసిట్టింగ్‌ ఎమ్మెల్యే దొరబాబు సహకారం లేకుండా గీత విజయం సాధించగలరా? అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సరే కాపు సామాజికవర్గం.. అందునా మహిళానాయకురాలు కావడంతో విక్టరీ కొట్టడం ఈజీ అని ధీమా ప్రదర్శిస్తోందివైసీపీ.ఇక పిఠాపురం నుంచి జనసేనాని పవన్‌ పోటీ చేస్తారన్న ప్రచారం కూడాపిఠాపురంపై అంచనాలు పెంచేసింది. జనసేనాని సొంత సామాజికవర్గం ఎక్కువగాఉన్న పిఠాపురం అయితే ఈజీగా గెలుస్తారని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలోకాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ సీటు ఆశిస్తుండటంతో పిఠాపురంవీఐపీ నియోజకవర్గంగా మారిపోయింది. పవన్‌ పోటీ చేయకపోయినా, 70వేల కాపులఓట్లు ఉన్న పిఠాపురం జనసేనకే కేటాయించాలని ఆ పార్టీ ఒత్తిడి చేస్తోంది.ఐతే ఈ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూపిఠాపురం వదుకోకూడదనే పట్టుదల ప్రదర్శిస్తుండటంతో కూటమి రాజకీయంకాకరేపుతోంది.

పిఠాపురంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. మాజీఎమ్మెల్యే SVSN వర్మ కూడా బలమైన నేత. 2009లో స్పల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినవర్మ.. 2014లో టీడీపీ టికెట్‌ నిరాకరిస్తే స్వంత్రంగా పోటీ చేసిగెలిచారు. ఇక గత ఎన్నికల్లో ఓడినా.. నాలుగున్నరేళ్లుగా పార్టీనికాపాడుకుంటూ వచ్చారు. ఈసారి ఎలాగైనా టీడీపీ సింబల్‌పై పోటీ చేసి గెలవాలనిబలంగా కోరుకుంటున్నారు వర్మ. పార్టీ తనను కాదని జనసేనకు కేటాయిస్తే..

స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన అంతర్గతంగా చెబుతుండటం హీట్‌పుట్టిస్తోంది. జనసేనకు కేటాయించాల్సి వస్తే.. పవన్‌ మాత్రమే పోటీచేయాలని.. పవన్‌ గెలుపునకు సంపూర్ణంగా సహకరిస్తానని కూడా వర్మచెబుతుండటంతో పార్టీ డైలమాలో పడింది.ఇక ఇప్పటికే రాజోలు, రాజానగరం నుంచిపోటీ చేస్తామని జనసేనాని పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. పిఠాపురంలో పవన్‌పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా.. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తేపవన్‌ మళ్లీ భీమవరం నుంచి పోటీకి దిగేలా కనిపిస్తోంది. ఇక ముద్రగడజనసేనలో చేరతారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. టీడీపీ-జనసేన నేతలు
ముద్రగడతో గతంలో సంప్రదించినా.. ముద్రగడ అడుగులు జనసేన వైపు ఇంకా పడలేదు.ఎన్నికల ముందు ముద్రగడ వస్తే.. ఆయనకు సీటు కేటాయిస్తారా? లేక ప్రచారానికేవాడుకుంటారా? అన్నది తేలాల్సివుంది.ఇదే సమయంలో జనసేన నుంచి పోటీకి యువనేతఉదయ శ్రీనివాస్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఐతే ఇక్కడ వర్మ లేదా పవన్‌ పోటీచేస్తేనే గట్టిపోటీ ఇవ్వగలరనే వాదన వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ-జనసేనమధ్య పిఠాపురం సీటు విషయంలో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున యుద్ధంజరుగుతోంది. సహనం కోల్పోయి పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం హీట్‌పుట్టిస్తోంది. ఇలా పిఠాపురం పీఠం చాలా హాట్‌గా మారిపోవడం.. సీట్లసర్దుబాటు వరకు ఇదే టెంపరేచర్‌ కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతోరాజకీయం రసవత్తరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *