అటవీ సంపదను దోచుకుంటున్న ఒక అధికారి
అక్రమంగా ఎర్రచందనం తరలింపు
అటవీ సంపద తరలింపులో బీట్ అధికారులే కీలకం
తాజాగా ఇద్దరూ పోలీసులు
ఎర్రచందనం తరలింపులో ఆ ఇద్దరు పోలీసులు కీలకపాత్ర
ఇప్పటికీ పరారీలో ఆ ఇద్దరు పోలీసులు
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు పోరుమామిళ్ల అటవీ శాఖలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు అటవీ సంపదను దోచుకుంటున్న ఒక అధికారిని ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు
బద్వేలు పోరుమామిళ్ల అటవీశాఖ పరిధిలోని అడవుల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఎర్రచందనం తరలించే విషయంలో కొందరు బీట్ అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు ఇది కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే రెండు ఫారెస్ట్ రేంజ్ లో పరిధిలో లెక్కకు మించి ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు కానీ అధికారుల లెక్కల్లో కేవలం కొద్ది మంది మాత్రమే ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నారు బద్వేల్ కేంద్రంగా తల పండిన ఎర్రచందనం స్మగ్లర్లు ఇప్పటికీ లేకపోలేదు పైకి పెద్దమనుషుల చలామణి అవుతున్న వారు ఇప్పటికి కూడా అదే వృత్తిలో ఉన్నారు అటవీ సంపదను దోచుకుంటూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు తాజాగా బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ అట్లూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రామకృష్ణ ఎర్రచందనం రవాణా లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇది విషయం అధికారుల విచారణలో బయట పడడంతో జిల్లా పోలీస్ ఎస్పీ వారిద్దరిని సస్పెండ్ చేశారు ఇప్పటికీ ఆ ఇద్దరూ పోలీస్ కానిస్టేబుళ్లు ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు సమాచారం ఇది కూడా అందరికీ తెలిసింది అడవుల్లోని కలప ఎంతో విలువైన అటవీ సంపదను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు గత నెల రోజులుగా ఈ దోపిడి మరింత ఎక్కువైంది పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బీట్ అధికారి దస్తగిరి రెడ్డి అక్రమంగా కలప తరలిస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులకు పట్టుబడ్డారు ఇలాంటి కోవలోకి మరి ఎంతోమంది బీట్ అధికారులు ఉన్నారు ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులే ప్రైవేట్ సంభాషణలో చెబుతున్నారు అడవుల్లో చెట్లను నరికించి వాటిని బొగ్గుగా మార్చి ట్రాక్టర్ కు 3000 రూపాయల ప్రకారం వసూలు చేస్తున్నారు ఇది కూడా అందరికీ తెలిసిందే
అడవుల్లో ఒకపక్క ప్లాంటేషన్ జరుగుతుంటే మరోపక్క ఎంతో విలువైన చెట్లను నరికించి బొగ్గుగా మార్చడం ఆందోళన కలిగించే విషయం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అటవీ శాఖ అధికారులే పదేపదే చెబుతుంటారు కానీ చేతలకు మాటలకు పొంతనే లేకుండా పోయింది కొద్దిరోజుల
క్రితం పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులే చెబుతున్నారు ఉన్నతాధికారుల కళ్ళు కప్పి ఎంత అటవీ సంపదను దోచుకున్నారు అనే విషయం లెక్క తెలవలసి ఉంది