-మంథని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి
సిరా న్యూస్,మంథని;
ప్రజా పాలన కార్యక్రమములో అభయహస్తం మహాలక్ష్మి పథకం క్రింద సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ స్కీం కొరకు దరఖాస్తులు పెట్టుకున్న లబ్దిదారుల ఇంటి కి వెళ్లి సర్వే చేసి ఆన్లైన్ లో నమోదు చేయాలని మంథని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి సిబ్బందికి సూచించారు. బుధవారం ప్రజా పాలన అభయహస్తం మహాలక్ష్మి ఎల్పిజి పథకం పై మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి మంథని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా అర్పిస్, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్, మున్సిపల్ సిబ్బంది లతో సమావేశాన్ని నిర్వహించి సలహాలు సూచనలను అందించారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుని ఇంటింటికి వచ్చి సర్వే నిర్వహిస్తామన్నారు. లబ్ధిదారులు తమ సిబ్బందికి సహకరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత , మెప్మా ఆర్పిస్, ఆశ వర్కర్స్, అంగన్ వాడి టీచర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.