కేటీఆర్
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్… ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ ని గత ప్రభుత్వం నామినేట్ చేస్తే… రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించింది. కానీ ఈరోజు వస్తున్న వార్తలు ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం ని ఎట్లా ఆమోదిస్తున్నారు ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాలమీద.. గవర్నర్ చెప్పాలి. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు.. రాజభవన్ నడుస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మీరు బాధ్యులు రేవంత్ రెడ్డికి కాదు రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ బిజెపికి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు వి నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలి. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్ బిజెపిలో కుమ్మక్కును తెలియజేస్తుందని అన్నారు. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసిన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతామని అన్నారు.