సిరా న్యూస్,కడప;
ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన జగనన్న కాలనీ సమీపంలో 158 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ మినీ లారీలో పొరకల చాటున ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తున్నారని సమాచారం రావడంతో దాడి చేసి స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు. . దాదాపు నాలుగు వేల కిలోల బరువు గల 158 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ తో పాటు,మరో కొంత మంది పరారైనట్లు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
=====