సిరా న్యూస్,కోవూరు;
నెల్లూరు పెన్నానదిలోకి భారీ బోట్లను దించుతున్నారు. పోతిరెడ్డిపాలెం సమీపంలో పెన్నానదిలోకి రెండు భారీ బోట్లను లారీల్లో తీసుకొచ్చి.. జేసీబీల సాయంతో నీటిలోకి దించారు. అయితే ఈ బోట్లను ఎందుకు తీసుకొచ్చారనే సమాచారం మాత్రం ఎవరూ చెప్పడం లేదు. కొందరు మాత్రం పెన్నానదిలో నుంచి ఇసుకను బయటకు డంప్ చేసేందుకు తీసుకొచ్చారని అంటున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు అయితే పోతిరెడ్డి పాలెం ప్రజలు మాత్రం ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. గత 2021 లో కూడా పెన్నా పొర్లు కట్ట అ ప్రాంతంలో తెగడంతో ఊరు మొత్తం మునిగిపోయి భారీ ముప్పు సంభవించింది. ఇప్పుడు అక్కడే పెద్ద పెద్ద భారీ బోట్లను దించుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.