సిరా న్యూస్,ఛత్తీస్ ఘడ్;
కోబ్రా కమాండో జవానులు మానవత్వం చాటుకున్నన్నారు. బాలింతను నవజాత శిశువును బీజాపూర్ జిల్లా ఊసూరు, నంబి గ్రామాల మధ్య ఉన్న నంబిధారా నదిని దాటించారు. నంబి గ్రామంలోని నయాపారా నివాసి మడివి జాగి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు పడుతుండటంతో ఊసూరుకు తరలించే క్రమంలో ఉదృతంగా ప్రవహిస్తున్న నంబిధారా నదిని దాటవలసి రాగా కోబ్రా 205 జవానుల సహాయంతో నదిని దాటారు. ఊసూరు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో తల్లి,బిడ్డ క్షేమంగా వున్నారు.