సిరా న్యూస్, హుస్నాబాద్:
హుస్నాబాద్‌లో గిరిజన నాయకుల వంటవార్పు
హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో శనివారం గిరిజన నాయకుల ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ బంజారాభవన్ కు రోడ్డును వెంటనే నిర్మించాలని, రోడ్డుకు అడ్డుగా నిర్మించినటువంటి ఇళ్లను తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.