సిరా న్యూస్,హైదరాబాద్
సైదాబాద్ పోలీసు స్టేషన్లో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారుడినే పోలీసులు చితకబాదారు. రాంసింగ్ అనే చిరు వ్యాపారిని ఎస్సై సాయి కృష్ణ కానిస్టేబుళ్లు విచక్షణా రహితంగా కొట్టారు. సింగరేణి కాలనీకి రాంసింగ్ భార్య రెండు నెలల క్రితం ఇంటి పక్కన వాళ్లతో గొడవ జరిగింది.అదే రాత్రి ఆమె మృతి చెందింది.తన భార్య మృతికి ఇంటి పక్క వాళ్లే కారణమంటూ పిర్యాదు చేశారు. ఈ కేసు లో సాధారణ మృతిగా పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దాని కోసం భర్త రాంసింగ్ బుధవారం రాత్రి సైదాబాద్ పీఎస్ కు వెళ్ళాడు. అతడిని చూసిన ఎస్ ఐ సాయి కృష్ణ అతడిని రూంలోకి తీసుకు వెళ్లి లైట్లు అపి వేసి ఇతర సిబ్బందితో దుర్బాష లాడుతూ చితకబాదారు .విషయం తెలుసుకున్న బాధితుడు కుటుంబ సభ్యులు పీఎస్ కు పెద్ద ఎత్తున్న రావడంతో తో పోలీసులు సర్ది చెప్పి పంపించారు. బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు.న్యాయం చేయాలంటూ బాధితుడు వేడుకుంటున్నారు.
=====