సిరా న్యూస్,హైదరాబాద్;
మాదాపూర్ కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేసారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమి పై గత కొంతకాలంగా కావురి హిల్స్ అసోసియేషన్ పిర్యాదులు చేసింది. దీంతో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. నిర్మాణాలను తోలగించి కావురిహిల్స్ పార్క్ అని బోర్డు ఎర్పాటు చేసారు. కావురి హిల్స్ అసోషియషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లిజుకు ఇవ్వడం జరిగిందని స్పోర్ట్స్ అకాడమీ నిర్వహకులు ఆరోపించారు. తమ గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తోలగిస్తూన్నరని అంటున్నారు.