సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఇందిరాగాంధీ సొసైటీ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసారు. భారీ బందోబస్తు మధ్యన అప్ప చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. వర్షంలోనూ కూల్చివేతలు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇందిరాగాంధీ సొసైటీలో పెద్ద ఎత్తున పరిశ్రమల షెడ్ల నిర్మాణం వ్యాపారులు చెపట్టారు. అక్రమ నిర్మాణదారులకు వివిధ పార్టీల రాజకీయ నేతల అండదండలు ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.