సిరా న్యూస్,రామగుండం;
తనపై నమ్మకంతో భారీ మెజార్టీ తో గెలిపించిన రామగుండం ప్రజల రుణం తీసుకుంటానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి రామగుండంలో పర్యటించిన మక్కాన్ సింగ్ కు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. నియోజక వర్గ పరిధిలోని బసంత్ నగర్, అంతర్గాం, రామగుండం, గోదావరిఖని పట్టణ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు చేసిన అన్యాయాలు, అక్రమాల నుండి ప్రజలను విముక్తి చేస్తానని తెలిపారు. రామగుండం నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.