IAUYSA: అండర్-17 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం: ఐఏయూవైఎస్ఏ

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
అండర్-17 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం: ఐఏయూవైఎస్ఏ

ఇంటర్నేషనల్ ఓమౌజయా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ (ఐ.ఏ.యు.వై.ఏస్.ఏ) స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే అండర్-17 క్రికెట్ టోర్నమెంట్, ముల్కనూర్ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో శ‌నివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో భీమదేవర పల్లి మండలంలోని వివిధ గ్రామాలనుండి మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ అధ్యక్షులు తిరుమల రిషి, ఏస్ఆర్టీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మొగిలి విచ్చేశారు. ఈ టోర్నమెంట్‌కు ఎంపైర్లుగా స్టాలిన్, శ్రీను, ప్రశాంత్ వ్యవహరించారు. ఈ సందర్భంగా తిరుమల రిషి మాట్లాడుతూ పిల్లలలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే విధంగా క్రీడలను, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు నగదు బహుమతిని , ట్రోఫీని ఆదివారం జరిగే ఫైనల్ తర్వాత అందజేయడం జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకులు హుస్సేన్ బాషా తెలిపారు.ఈ కార్యక్రమంలో కోర్ టీం సభ్యులు వంశీ, ముల్కనూర్ సభ్యులు చందర్, అంజి రెండి, చంటి, మనోజ్, గిరిచరన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *