సిరాన్యూస్, సైదాపూర్:
తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి: ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి
తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం సైదాపూర్ మండలంలోని ఆరెపల్లి అంగన్వాడి కేంద్రంలో గర్భవతులకు, తల్లులకు తల్లిపాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల వల్ల బిడ్డకు కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కిరణ్, ఆశవర్కర్ స్రవంతి, అంగన్వాడి కార్యకర్త అబ్బిడి లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.