సిరాన్యూస్, ఇచ్చోడ
ఇచ్చోడలో బీజేపీ నాయకుల విస్తృత ప్రచారం
ఇచ్చోడ మండలంలోని నేరడిగొండ జి, పెద్దగోదు మల్ల, చిన్న గోధుమల్ల, జండ గూడ, పకిరిపేట్, రాగి దుబ్బ, బొజ్జ గూడ, బాదిగూడ, లక్ష్మీ పూరి, సాత్మూరి, గ్రామాలలో గురువారం బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను గెలిపించాలని బిజెపి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ చేసిన పనులను వివరించారు.