సిరాన్యూస్, ఇచ్చోడ
ఇచ్చోడ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర కళాశాలలో ఘనంగా ఫ్రెషర్ డే
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర కళాశాలలో బుధవారం ఫ్రెషర్ డేను ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ ఏ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. నూతనంగా చేరిన విద్యార్థులకి స్వాగతం పలకడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణతో తాము అనుకున్న లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు.ఈ కార్యక్రమములో వైస్ ప్రిన్సిపల్ హరి రామ్, అధ్యాపకులు నర్మదా, సురేష్, అనిత, కవిత, రవి, వైద్యనాథ్, తుల దత్తు, శ్రీనివాస్, సదాశివ్,వంశీ, కృష్ణ, అర్జున్ పాల్గొన్నారు.