సిరాన్యూస్, ఆదిలాబాద్
ఐసీఐసీఐ బ్యాంక్‌లో దీపావళి వేడుకలు
ఐసిఐసిఐ బ్యాంక్ ఆదిలాబాద్ బ్రాంచ్ లో బుధవారం ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా బ్యాంకు మేనేజర్ గంగారాం, సిబ్బంది పాల్గొన్నారు.