ఎల్లంపల్లి నుండి భారీ వరద నీరు పార్వతి బ్యారేజీ లోకి వస్తే బ్యారేజీకి ప్రమాదం

సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీ కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం మూడు సంవత్సరాల క్రితం వరుసగా కురిసిన వర్షాలకు పార్వతి బ్యారేజీలోకి వచ్చి చేరే వరద నీటి ప్రవాహంతో కరకట్ట కోతకోయడంతో డామేజ్ అయిన పార్వతి బ్యారేజీ కరకట్టను అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టిన, మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో బ్యారేజీలోకి ఇన్ఫ్లో 2534 అవుట్ ఫ్లో 2534,వరద నీరు వస్తున్నాడంతో ఎగువ నుండి వస్తున్న వరద నీరుతో పూర్తిగా 74 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి బారిగా మీరు వస్తే గనుక కరకట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం ఉండడంతో కరకట్ట కోతకు గురైతే పక్కనే ఉన్న బెస్తపల్లి ,సిరిపురం గ్రామాలకు త్రీవ ప్రమాదం పొంచి ఉన్నదని తీవ్రంగా పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *