Illeagal Layout: అక్రమ లేఔట్ లపై చర్యలు తీసుకోవాలి…

సిరా న్యూస్, విశాఖపట్నం:

అక్రమ లేఔట్ లపై చర్యలు తీసుకోవాలి…

సిరా న్యూస్, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం లోని పెదగాడి గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు నీటిపల్లి రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం పెదగాడి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో కొంతమంది విఎంఆర్ఏ అప్రూవల్ లేనప్పటికీ కూడా అక్రమంగా లేఔట్ లు నిర్మించి ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఆ లేఅవుట్ లలో పార్క్ కోసం వదిలేసిన ఖాళీ స్థలాన్ని సైతం కబ్జా చేసి పలువురికి ప్లాట్లుగా చూపి అమ్మడం జరిగిందని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ నుండి తాము సమాచార హక్కు చట్టం ద్వారా ఈ లేఅవుట్ల గురించి సమాచారం కోరగా, వీటికి ఎలాంటి పర్మిషన్లు లేనట్లు సమాధానం ఇచ్చారని తెలిపారు. ఈ అక్రమ లేఅవుట్లపై, పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *