సిరా న్యూస్, భీంపూర్:
తాంసి-కే లో జోరుగా అక్రమ ఇసుక ధందా…
+ పెన్ గంగను తోడేస్తున్న అక్రమార్కులు
+ యదేచ్చగా అక్రమ ఇసుక రవాణా
+ భారీ వాహనాలు నడపడంతో పంట చేన్లు నాశనం అవుతున్నట్లు రైతుల ఆవేదన
+ అధికారులు పట్టించుకోవాలని డిమాండ్
ఆదిలాబాద్ జిల్లా తాంసి-కే మండలంలో అక్రమ ఇసుక రవాణా ధందా జోరుగా కొనసాగుతోంది. అక్రమార్కులు భారీ జెసిబిలతో పెన్ గంగలో ఇసుకను తోడేస్తున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా భారీగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పెద్ద పెద్ద లారీలు, టారస్ లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతినిత్యం వందలాదిగా వాహనాలు నడవడంతో పంట చేన్లు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగంగా అక్రమ ఇసుక ధందా కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు దీనిపై దృష్టి సారించి అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.