రాజకీయాల్లో అనైతిక ధోరణులు

సిరా న్యూస్;
ప్రస్తుత రాజకీయాల్లో అనైతిక ధోరణులు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఆయా రాజకీయా పార్టీలు, రాజకీయ నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు మాత్రమే ఉండేవి. ప్రతిపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ఆనాడు రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టేవారు. రాజకీయ నేతలకు ఆనాటి ప్రజలు అలాగే చక్కటి గౌరవం ఇచ్చేవారు. ఒక రాజకీయ పార్టీకి మరో రాజకీయ పార్టీ, ఒక నేతకు మరో నేత అత్యంత గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అలనాటి రాజకీయ తరంలో ఉండేది. ఆ తర్వాతి నుంచి రాజకీయాలు క్రమక్రమంగా మలినం అయ్యాయి. రాజకీయాల్లో నైతిక విలువలు మాయమయ్యాయి. రౌడీలు, గూండాలు, కుల , మత పిచ్చి ఉన్నవారు, డబ్బు సంపాదనే ధ్యేయంగా వచ్చేవారు, అధికారం అనే హోదా ఉండాలనుకునే వారు ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ప్రారంభమైంది. దీంతో మంచి రాజకీయ నేతలు ఉన్నా వారిని ప్రస్తుత రాజకీయాల్లో వెతికి పట్టుకోవాలంటే చాల కష్టమైన పని. ప్రతీ రాజకీయ పార్టీ గెలుపు గుర్రాలనే ఎన్నికల్లో నిలబెట్టేందుకు వారి గత చరిత్ర, స్వభావం, కేసులు వంటివి పట్టుంచుకోకుండా టికెట్లు ఇవ్వడం ప్రారంభమయ్యాయి. దాంతో రాజకీయాలు నేరాలు కవలలుగా మారాయి. ఇదంతా ఎందుకంటే యాథారాజ తథా ప్రజ అన్నట్లు… ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు, వారి అనుచర గణం వ్యవహరిస్తున్న తీరు జుగుప్సను కలిగించేలా ఉంది. తమ ప్రత్యర్థిని లేదా ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేందుకు నైతిక నియమాలు, విలువలను పక్కనబెట్టి మరీ వ్యహరిస్తున్న తీరు దిగజారుతున్న రాజకీయాలకు నిదర్శనంగా చెప్పవచ్చుఒకప్పుడు రాజకీయ నేతలంటే మాట మీద నిలబడే వారే అనే వారు. ఇప్పుడు నోరు జారితేనే, దురుసుగా మాట్లాడితేనే, సీనియర్ అయినా జూనియర్ అయినా నోటికొచ్చిన తిట్లు తిడితేనే నేతలన్న రీతిలో పరిస్థితి మారింది. ప్రత్యర్థి పార్టీని లేదా ఆ పార్టీ అధినేతను ఎవరు బాగా తిడతారో వాళ్లనే రాజకీయ పార్టీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. దీంతో తల్లి, చెల్లి, కొడుకు, కూతురు అనే తేడా లేకుండా నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. సిద్ధాంతాలు, అభివృద్ధి అనే అంశాలు పక్కకు పోయాయి. వ్యక్తిగత విమర్శలు, బెడ్ రూంలో విషయాలు, వ్యక్తిగత అలవాట్లు అభిరుచులపై విమర్శలు -ప్రతి విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నైతిక నియమాలను సీనియర్ నేతలే తుంగలో తొక్కుతుంటే, వారి అనుచరణ గణం, పార్టీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన రాతలు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో ప్రత్యర్థి నేతలను అడ్డుకునే చీప్ పాలిట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. నిజం ఏంటో చెప్పేలోపే ఈ అబద్ధం క్షణాల్లో అందరి మోబైల్స్‌లో ప్రత్యక్షమవుతుంటే ఏం చేయలో తెలియక అటు నేతలు, వారి కుటుంబ సభ్యులు మౌనంగా రోదిస్తున్నారు. ఇదంతా ప్రస్తుత మన నేతల చలవే. ఇలాంటి వారిని ముందుగానే కట్టడి చేయకుండా వదిలేయడంతో రాజకీయం అంటే ఇదే అన్న రీతిలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో ఈ అనైతిక ధోరణి ప్రబలిందిఏపీలో ఓ నాయకుడు ఏకంగా సీనియర్ పొలిటీషియన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపైనే అతిగా మాట్లాడటం, దాని మీద స్వయాన చంద్రబాబు రోదించడం మనం టీవీల్లో చూశాం. అదే రీతిలో ప్రత్యర్థి పార్టీ నాయకుడి వెఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ఇదే రీతిలో ఓ హీరోతో అనైతిక సంబంధాలను అంటగట్టి ప్రచారం చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కుమారుడి మీద బాధాకరమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఒక్క మాట చెప్పాలంటే మనం ప్రోత్సహించిన మాటల భూతమే ఇప్పుడు అన్ని పార్టీల నేతలను కాటు వేయాలని చూస్తోంది.అదే రీతిలో తెలంగాణలోనూ ఉద్యమ సమయంలోను, ఇప్పుడు కూడా వివాదస్పద వ్యాఖ్యలను నేతలు చెస్తూనే వస్తూ ఉన్నారు. పరుష పదజాలంతో మాట్లాడితేనే మీడియాలోవార్తలు వస్తాయని కొందరు, పరుషంగా మాట్లడితేనే ప్రజలు జై కొడతారని కొందరు నేతలు ఇష్టారీతిన అనైతిక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారుగత అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టి కొందరు పైశాచిక ఆనందం పొందారు. ఇటీవలే మరో మహిళా మంత్రి కొండాసురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫోటోలతో తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. వీటిపై ఆయా పార్టీలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నా చూసీ చూడనట్లు ఉండటంతో ఆయా పార్టీలో కొందరు అత్యుత్సాహంతో గీత దాటి అనైతిక ప్రచారాలకు పాల్పడుతున్నవైనాలు సంభవిస్తున్నాయి.ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం పరుషంగా మాట్లాడట ట్రెండ్ గా మారింది. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నేతల మాటలు విన్నా, వారికి కౌంటర్‌గా బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు విన్నా ఎంతటి సంచలనంగా మారాయో మనకు తెలియంది కాదు. తాట తీస్తాం, పూడ్చి పెడతాం, ఉరికించి కొడతాం, బట్టలూడదీస్తాం లాంటి పదాలు తరచూ వినబడుతున్నాయి. చవట, సన్నాసి అంటే రాజకీయనేతలేమో అన్న రీతిలో తమ ప్రసంగాల్లో ఆయా నేతలను తిట్టడం ద్వారా, ఆ పదాలకు పొలిటికల్ లీడర్లే ఓ బ్రాండ్ ఇమేజి తెస్తున్నారు. అంతే కాదు నేతల వ్యక్తిగత అలవాట్ల మీద ప్రచారాలు చూశాం. ఇక కీలకమైన నేతలు డా నోరు జారడం మనం చూస్తున్నాం.సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వారిని నమ్ముకోకండి ముంచేస్తారు అన్న పదం తీవ్ర దుమారం రేపింది. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన మహిళకు ఉచిత బస్ ప్రయాణంపై మాట్లాడుతూ డాన్సులు చేసుకోవడానికా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీనియర్ లీడర్లు కూడా కొన్ని సార్లు తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా వెంటనే దానిపై బేషరతుగా తప్పని ఒప్పుకుంటే హుందాగా ఉండేది. దానిపై మౌనంగా ఉంటడం, సమర్థించుకోవడం రెండు తప్పే. ఈ ధోరణి ఇతర నేతలకు, కార్యకర్తలకు తమ నాయకుల్లానే వ్యహరించాలని, మాట్లాడాలని ఓ మోడల్ గా తీసుకునే అవకాశం ఉంది.తాజాగా మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో చేసిన ప్రచారం తెలిసిందే. దీనిపై మంత్రి కొండా సురేఖ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది జరిగిన వెంటనే కేటీఆర్‌పై విమర్శలకు దిగిన మహిళా మంత్రి కొండా సురేఖ కూడా సంయమనం కోల్పోయి వ్యక్తిగత అంశాలపై నోరు జారారు. ప్రముఖ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగార్జున కుటుంబ వ్యవహారలను కేటీఆర్‌కు ముడిపెడుతూ మాట్లాడటం అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో నోటి మాటలు హద్దు మీరుతున్నాయి. పదునైన మాటలు, బాధించే భాషా ప్రయోగం, హేయమైన విమర్శలతో ఒకరిపై ఒకరు వ్యక్తిత్వం దెబ్బతీసుకునేలా వ్యహరిస్తున్న తీరు గర్హనీయం అనే చెప్పాలి.విషయం ఉన్నా లేకున్నా, ప్రాస, యాస, రైమింగ్ వర్డ్స్ కోసం చాలా మంది నేతలు ప్రయాస పడుతున్నారు. పరుష పదజాలం ఉంటేనే అద్భుతమైన ప్రసంగంగా ఆ నేతల వందిమాగదులు, కొన్నిసార్లు కొన్ని మీడియా సంస్థలు గుర్తించే పరిస్థితి ఏర్పడింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *