సిరా న్యూస్,అమరావతి;
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
తుపాను ప్రభావం, చేపడుతున్న సహాయచర్యలపై అధికారులు సీఎంకి వివరాలు అందించారుర.
సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ వర్షాల నుంచి తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా క్షేత్రస్ధాయిలో మంచిగా పనిచేశారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి. చిన్న చిన్న విషయాల మీద ధ్యాస మిస్ కాకుండా చూసుకోవాలి. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి. బాధితుల స్ధానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సాయం వారికి అందాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రూ.10 ఎక్కువ ఖర్చు అయినా.. బాధితులకు మంచి సహాయం అందాలి. ఆ దిశగా పనిచేయాలి. ప్రతి ఒక్కరి నోటా.. ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్ బాగా చేశాడన్న మాట వినిపించాలి. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలి. పరిహారం అందించడంలో సానుభూతితో ఉండండి.
సాయంలో లోటు రాకూడదు…