సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలి? భక్తుల ను ఎలా రక్షించాలి? అనే దాని పై ఈ డ్రిల్ చేశారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏటా ఈ డ్రిల్స్ నిర్వహించడం పరిపాటి. ఆక్టోపస్ ఎస్పీ బి.రవిచంద్రన్ పర్యవేక్షణలో బీఎస్పీ బి.కృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగితే ఎలా వ్యవహరించాలనే దానిపై ఆలయ సిబ్బందికి, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్ఓ నారాయణ, వీఐ వెంకటరమణారెడ్డి, సూపరింటెండెంట్లు నాగరాజు, మోహన్, ఏఈ మురళీమోహన్, ఆక్టోపస్ ఇన్స్పెక్టర్లు రాంబాబు, కేవీఎస్.రామకృష్ణ, ఎం.రవిబాబు, శివారెడ్డి, అగ్రిమాపక సిబ్బంది పాల్గొన్నారు.