సిరా న్యూస్,గూడూరు;
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గూడూరు డివిజన్ వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహంలో కారు చిక్కుకుంది. వెంకటగిరి నుండి నెల్లూరుకు కారులో ఓ కుటుంబం ప్రయాణిస్తోంది. స్థానికులు కారులో వున్నవారిని రక్షించారు.