సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను, వోల్వో బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని తిరిగి గుత్తి వైపు వెళుతుండగా, గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44వ హైవేపై బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న వోల్వో బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య (45), శ్రీరాములు (45), నాగార్జున (30), శ్రీనివాసులు (30)గా గుర్తించారు. గాయపడ్డ నరేశ్ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.