సిరా న్యూస్;
అమలాపురం
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపు రం రూరల్ మండలం సమనస బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కడుపునొప్పి , బ్లడ్ మోషన్స్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర కడుపునొప్పి బ్లడ్ మోషన్స్ తో ఇబ్బందులు పడ్డారు.పీహెచ్సీ వైద్యులతో చికిత్స చేయించినప్పటికీ తగ్గకపోవడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆరవ తరగతి చదువుతున్న ఆరుగు విద్యార్థులకు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికెన్ కర్రీతో బిర్యానీ తిన్న తర్వాత విద్యార్థులకు కడుపునొప్పి ,బ్లడ్ మోషన్స్ ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఫ్లూయిడ్స్, యాంటీబయటిక్ అందిస్తున్నాం తగ్గేవరకు హాస్పటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచుతామని అమలాపురం ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ శంకర్ రావు అన్నారు.