పాల్గోన్న ఈవో పెద్దిరాజు, భక్తులు
సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైల మహక్షేత్రంలో సాయంత్రానికి మాఘశుద్ధ పౌర్ణమిని ఘడియలు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ముందుగా శ్రీస్వామి అమ్మవార్ల మహమంగళహరతుల తరువాత స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులనుజేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత శ్రీస్వామి అమ్మవార్లను ధర్మప్రచార రధంలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెద్దిరాజు అర్చకులు ప్రారంభించారు ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపము, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపము, గంగాసదనము,బయలు వీరభద్రస్వామి ఆలయం పంచమఠాలు,మల్లమ్మ కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపము మీదుగా ఆలయ మహద్వారము చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు