సిరా న్యూస్,నరసరావుపేట;
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట,చిలకలూరిపేట, సత్తెనపల్లి నుండి మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చ్చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరు నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్న క్రమంలో నరసరావుపేట మెయిన్ బ్రాంచ్ అని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిందని తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలు నిలుపుదల చేసేందుకు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చామని అగ్నిమాపక అధికారి ఎంవి సుబ్బారావు తెలియచేసారు.