ఈనెల 14 న ఎల్.బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాల ప్రారంభోత్సవం

14 వేల మంది పాఠశాల విద్యార్థులచే సమావేశం
సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి బాలల దినోత్సవం సందర్బంగా ఈనెల ఈ నెల 14 వ తేదీన ఎల్.బీ స్టేడియంలో దాదాపు 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సర కాలంలో విద్యార్థుల కోసం చేసిన గణనీయమైన మార్పులు, డైట్ చార్జీల పెంపు, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన,ఇంటి గ్రేటడ్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంట్, తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. ఎల్.బీ స్టేడియం లో 14 వ తేదీన నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లపై నేడుసాయంత్రం సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు శ్రీధర్, బుర్రా వెంకటేశం, కార్యదర్శి శరత్ తదితర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పాలన ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా ఈనెల 14 తేదీ నుండి డిసెంబర్ 9 వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *