ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక నియోజకవర్గం లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి పినపాక,కరకగూడెం,మణుగూరు,అశ్వాపురం మండలాల్లోని వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను చిత్తడిగా మారడంతో ప్రజలు ఇండ్లకే పరమైతమైన్నారు. మణుగూరు సింగరేణి ఉపరితల బొగ్గు గనులలో 70 MM మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది ఉపరితల గనులలో వర్షపు నీరు చేరడంతో బొగ్గు రవాణాకు , ఉత్పత్తికి ( ఓబి) మట్టి పనులకు అంతరాయం కలిగింది 36 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి,2 లక్షల 90 వేల క్యూబిక్ మీటర్ల ( ఓబి) మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది, గత నాలుగు రోజుల వర్ష ప్రభావంతో సింగరేణి ఉపరితల బొగ్గు గనులు ఓసి2 ఓసి4 మణుగూరు ఓసి లో 85 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి 11 లక్షల 60 వేల క్యూబిక్ మీటర్ల (ఓబి) మట్టి వేలికితి పన్నులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అశ్వాపురం మండలంలో ఇసుక వాగు,కరకగూడెం మండలంలో పెద్దవాగు మణుగూరు మండలంలో కోడిపుంజుల వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు వంకలు చెరువులు పొంగిపొరడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. చెరువులు అలుగులు పోయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *