సిరాన్యూస్, జైనథ్
సమగ్ర ఇంటింటి సర్వేకు సహకరించాలి: ఇన్చార్జీ ఎంపీడీఓ వెంకట రాజు
సమగ్ర ఇంటింటి సర్వేకు సహకరించాలని ఇన్చార్జీ ఎంపీడీఓ వెంకట రాజు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రి గ్రామంలో సమగ్ర ఇంటింటి సర్వేను ఇన్చార్జీ ఎంపీడీఓ వెంకట రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జీ ఎంపీడీఓ వెంకట రాజు మాట్లాడుతూ ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు , అలాగే రాబోయే రోజుల్లో ప్రజాపాలన కు ప్రణాళిక రూపకల్పన కోసం నిజమైన లబ్దిదారుల ఎంపిక కు ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. అధికారులకు సరైన సమాచారం అందించాలని, ఈ సర్వే పై ఎటువంటి అపోహలు అవసరంలేదని తెలిపారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగన్న, ఉపాధ్యాయులు కృష్ణ, వీఆర్ే దశరథ్, కారో బార్ రాఘవ, శివ్వన్న రాము గ్రామస్తులు పాల్గొన్నారు.